విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పాలిస్తున్న కాలంలో తెనాలి రామకృష్ణుడి తెలివితేటలకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఎలాంటి క్లిష్టమైన సమస్య ఎదురైనా తన చమత్కారంతో, సమయస్ఫూర్తితో పరిష్కరించేవాడు. అందుకే రాజు కూడా ముఖ్యమైన సమస్యలు ఎదురైనప్పుడు తెనాలి రామకృష్ణుడి సలహా తీసుకునేవారు. అలాంటి ఒక సందర్భంలో మహారాణి విలువైన వజ్రాల హారం కనిపించకుండా పోయింది. రాజభవనంలో కలకలం రేగింది. అయితే కేవలం మూడు మట్టి కుండల సాయంతో అసలు దొంగను గుర్తించేలా చేసిన తెనాలి రామకృష్ణుడి ఆలోచన అందరినీ ఆశ్చర్యపరిచింది..