దీపావళి వేళ ఏపీ ప్రజలకు ప్రభుత్వం తీపికబురు అందించింది. కిలో ఉల్లి రూ.35కే పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. రైతు బజార్ల ద్వారా వీటిని అందించనుంది. నేటి నుంచి వీటిని విక్రయించనున్నారు. వీటిని తీసుకోవాలంటే ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఏపీ ప్రజలకు దీపావళి వేళ కూటమి సర్కార్ భారీ శుభవార్త అందించింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతోంది. ప్రతీ ఇంట్లో ఉల్లిపాయలు అనేది అత్యంత అవసరం. పండుగ వేళ పెరిగిన ఉల్లి ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.