India vs Bangladesh: భారత క్రికెట్ అభిమానులకు ఆసక్తికరమైన వార్త! బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా సిద్ధమవుతున్నట్లు సమాచారం. రెండుసార్లు వాయిదా పడిన ఈ పర్యటన 2027 జనవరిలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టూర్లో ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. అయితే భారత ప్రభుత్వ అనుమతి కీలకంగా మారింది. India vs Bangladesh: టీమిండియా (Team India) క్రికెట్ షెడ్యూల్లో మరో ఆసక్తికరమైన పర్యటన చేరబోతోంది. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు, త్వరలో బంగ్లాదేశ్లో పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.