హైదరాబాద్‌లో ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి భయాలు నెలకొన్నాయి. నీటిని పొదుపుగా వాడాలని, వాహనాలు కడిగితే జరిమానాలు తప్పవని జలమండలి హెచ్చరిస్తోంది. ఓవైపు సామాన్యులు నీటి కోసం ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్లో సిబ్బంది తమ వాహనాలను నీళ్లతో కడుగుతున్న వీడియో వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లో ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి భయాలు వెంటాడుతున్నాయి. నీటిని పొదుపుగా వాడాలని, అనవసరంగా వృథా చేయొద్దని జలమండలి అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నారు. బోర్లు వేయొద్దని, కార్లు, బైక్‌లు కడగడానికి తాగునీటిని వినియోగించొద్దని సూచిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు కూడా విధిస్తున్నారు.