ఏపీలో రెండు ఎయిర్‌పోర్ట్‌లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొమ్మిది కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు అనుమతి మంజూరు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. ప్రస్తుతానికి రెండు ఎయిర్‌పోర్టుల నిర్మాణ కోసం కేంద్ర విమానయానశాఖ అనుమతులు జారీ చేసింది. త్వరలో వీటి పనులు మొదలుకానున్నాయి. రాష్ట్రంలో మరో రెండు కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ అనుమతులు జారీ చేసింది. కుప్పం, శ్రీకాకుళంలో ఎయిర్‌పోర్టులు నిర్మించేందుకు స్థల అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (APADCL) ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్దం చేసింది.