Paraguay Crisis: దక్షిణ అమెరికా దేశమైన పరాగ్వేలో భారీ రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. దేశంలో తలెత్తిన తీవ్ర బ్యాంకింగ్ సంక్షోభం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈ పరిణామాల నేపథ్యంలో అధ్యక్షుడు శాంటియాగో పెనా (Santiago Pena) తన పదవిని కోల్పోయారు. పార్లమెంట్లో అభిశంసన ప్రక్రియ ద్వారా ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. అంతేకాకుండా ఆయనను గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు ఉపాధ్యక్షుడు పెడ్రో అలియానా (Pedro Alliana) కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు..