తెలంగాణలో వైద్య విద్యను అభ్యసించాలనుకునే అభ్యర్థులకు , వైద్య రంగంలో మెరుగైన సేవలు కోరుకునే ప్రజలకు జాతీయ వైద్య కమిషన్ శుభవార్త అందించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. జాతీయ వైద్య కమిషన్ తాజాగా కొత్తగా మరో 359 పీజీ సీట్లకు ఆమోదం తెలపడంతో, రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ సీట్ల సంఖ్య 1,266 నుంచి ఏకంగా 1,625కు చేరుకుంది. తొలిసారిగా 13 కొత్త కాలేజీలకు పీజీ.