Revanth Reddy Birthday Wishes: మనలో చాలామంది.. వారికి ఇష్టమైన వారి పుట్టినరోజు లేదా ఏదైనా ముఖ్యమైన రోజున శుభాకాంక్షలు తెలుపుతుంటారు. అందులో చాలాతక్కువ మంది ఎదుటివారి జీవితాంతం గుర్తిండిపోయేలా శుభాకాంక్షలు చెబుతుంటారు. ఇక అసలు విషయానికి వస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ నేత మెట్టు సాయికుమార్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. పొలంలో వరి నారును ఉపయోగించి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని రూపొందించారు. ఈ నెల 8న సీఎం పుట్టినరోజు.