హనుమకొండను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రావు తెలిపారు. వరంగల్ క్రైం (హనుమకొండ), న్యూస్‌టుడే: హనుమకొండను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రావు తెలిపారు. ఇటీవల జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల కేసులు వెలుగు చేస్తున్న నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ ఆయనతో ముఖాముఖి నిర్వహించింది. ఈఎస్: మత్తు పదార్థాల రవాణాతోపాటు తాగేవారిని గుర్తించేందుకు ఇతర ప్రభుత్వ శాఖలతో కలిసి ప్రత్యేక బృందం ఏర్పాటు చేశాం. వీరు నిరంతరం తిరుగుతూ సమాచారం సేకరిస్తుంటారు, తనిఖీలు చేపడతారు. నిందితులకు కోర్టులో శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటారు.