హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన 13 ఏళ్ల గుడ రోహిత మరణానంతరం ఆరుగురికి కొత్త జీవితాన్ని అందించింది. కూకట్‌పల్లికి చెందిన ఈ బాలిక అవయవాలను దానం చేసేందుకు తండ్రి నారాయణరావు ముందుకొచ్చారు. జీవన్‌దాన్ ద్వారా కిడ్నీలు, కాలేయ భాగాలు, రెండు కార్నియాలను దానం చేశారు. కూతురిని కోల్పోయిన బాధలోనూ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని పోలీస్ కమిషనర్ సజ్జనార్ అభినందించారు.