మనుషులకే కాదు.. కొన్ని జంతువులకు కూడా అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంటుంది. ఒకసారి చూసిన మనిషిని ఏళ్ల తర్వాత కూడా గుర్తుపట్టడం, ఆహారాన్ని ఎక్కడ దాచుకున్నాయో గుర్తుంచుకోవడం, గతంలో నేర్చుకున్న విషయాలను మళ్లీ ఉపయోగించడం వంటి ప్రత్యేక లక్షణాలు వాటిలో కనిపిస్తాయి. ముఖ్యంగా అడవుల్లో నివసించే జంతువులకు ఈ జ్ఞాపకశక్తి వాటి మనుగడకు ఎంతో ఉపయోగపడుతుంది. నీటి వనరులు ఎక్కడ ఉన్నాయి? ఆహారం ఎక్కడ దొరుకుతుంది? ప్రమాదకరమైన వ్యక్తులు ఎవరు? వంటి విషయాలను గుర్తుంచుకోవడం వాటికి ప్రాణరక్షణగా మారుతుంది.