నిన్న విడుదలైన 'రామాయణ'లో ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటించింది. శూర్ఫణఖ పాత్రలో ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా రామాయణం సినిమా, శూర్ఫణఖ పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది రకుల్. నిన్న (నవంబర్ 05) విడుదలైన బాలీవుడ్ 'రామాయణ' సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది. నితేశ్ తివారీ టేకింగ్, రణ్ బీర్, సాయి పల్లవి, యశ్ ల యాక్టింగ్, అలాగే హాలీవుడ్ ని మించి పోయిన విజువల్ ఎఫెక్ట్స్.. వెరసి ఆధునిక రామాయణం ప్రేక్షకులకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తోది.