తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో హిట్ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు నటి హేమ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ సీనియర్ హీరో పై తనకున్న అభిమానాన్ని బయటపెట్టారు. అలాగే ఆయనంటే తనకు క్రష్ అని చెప్పారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి అంటే గౌరవం అని తెలిపారు. టాలీవుడ్ హేమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించి తనదైన ముద్ర వేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్ ప్రముఖ నటులు అక్కినేని నాగార్జున , చిరంజీవి పట్ల తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు.