Karnataka: బెంగళూరులో (Bengaluru) కలకలం రేపిన దారుణం వెలుగులోకి వచ్చింది. భార్య పదే పదే తన పుట్టింటికి వెళ్తోందన్న కోపంతో ఓ క్యాబ్ డ్రైవర్ (cab driver) ఏకంగా భార్యతో సహా ఏడుగురు అత్తగారింటి సభ్యులను అత్యంత దారుణంగా హత్య (murder spree) చేశాడు. రెండ్రోజుల వ్యవధిలో జరిగిన ఈ ఘోరకలిలో ఏడేళ్ల చిన్నారి కూడా బలయ్యాడు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని ఇందూశేఖర్గా (Indushekhar) పోలీసులు గుర్తించారు. ఇందూశేఖర్, సునీతలకు (Sunita) 20 ఏళ్ల క్రితం పెళ్లయింది. అయితే, భార్య తరచూ పుట్టింటికి వెళ్లడం, దానికి ఆమె తల్లి, సోదరులు మద్దతుగా నిలవడంతో నిందితుడికి విసుగు వచ్చింది.