తెలుగువారి విందు భోజనాలలో పులావ్ లేదా వెజ్ బిర్యానీ చేసినప్పుడు దానికి తోడుగా మిర్చి కా సాలన్ కంటే ఎక్కువగా ఆదరణ పొందే సైడ్ డిష్ 'గోంగూర కూర'. ఫంక్షన్లలో బిర్యానీతో పాటు వడ్డించే ఈ గోంగూర కూర సాధారణ పచ్చడిలా కాకుండా.. కాస్త గ్రేవీగా, పుల్లపుల్లగా, కారకారంగా ఉంటూ పంటి కింద శనగపప్పు పలుకులు తగులుతూ అద్భుతమైన రుచినిస్తుంది. వర్షం పడుతున్న వేళ వేడివేడి బిర్యానీతో ఈ గోంగూర కూరను కలిపి తింటే ఆ మజాయే వేరు.