రాష్ట్రవ్యాప్తంగా అక్రమ మైనింగ్, అనధికారిక తవ్వకాలు, ఖనిజాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అక్రమాలను నియంత్రించేందుకు మధ్యంతర మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై అక్రమ మైనింగ్‌పై వచ్చే ప్రతి ఫిర్యాదును నమోదు చేసి, మూడు పని దినాల్లో పరిశీలించాలని ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సమన్వయ బాధ్యతలు అప్పగించింది. ప్రతి ఫిర్యాదుకూ ప్రత్యేక ఐడీ పత్రికలు, టీవీ ఛానళ్లు, డిజిటల్ మీడియా, హెల్ప్లైన్లు, విజిలెన్స్ యాప్ ద్వారా వచ్చే.