సామాన్యుల నడ్డి విరుస్తున్న బియ్యం ధరల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ రంగంలోకి దిగింది. నిత్యావసర సరుకుల ధరలను అడ్డగోలుగా పెంచుతూ, తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులపై కొరడా ఝళిపించింది. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టిన అధికారులు, నిబంధనలు ఉల్లంఘించిన కేటుగాళ్లపై కఠిన చర్యలు ప్రారంభించారు. 2,686 తనిఖీలు.. 370 కేసులు నమోదు రాష్ట్రంలో బియ్యం అక్రమాలు, అధిక ధరల విక్రయాలపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ అధికారులు ముమ్మర.