ఇటీవల బాక్సాఫీస్ ను షేక్ చేసిన చిన్న సినిమాల్లో ఇది ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ డివోషినల్ మూవీ ఏకంగా రూ. 450 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్డడం విశేషం. మరి ఈ మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా కేవలం 2 కోట్ల రూపాయలే. విశాల్ చతుర్వేది దర్శకత్వంలో, నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా రూపొందిన 'హనుమాన్ అన్ష్' చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. చిత్ర నిర్మాతలు సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక వీడియోను పంచుకోవడం ద్వారా దాని ఓటీటీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.