అందాల భామల ప్రపంచంలో భారత్ తలమానికంగా నిలిచేందుకు మరో అరుదైన వేళ ఆసన్నమైంది. గత ఆగస్టులో ‘మిస్ యూనివర్స్ ఇండియా 2026’ కిరీటాన్ని కైవసం చేసుకున్న కేరళకు చెందిన 19 ఏళ్ల వయసు అందాల తార కజియా లిజ్ మేజో.. ఇప్పుడు ఏకంగా ప్రపంచ వేదికపై తలపడేందుకు విమానం ఎక్కేసారు. ప్రతిష్టాత్మక 75వ మిస్ యూనివర్స్ పోటీల్లో మన దేశం తరఫున త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించడానికి ప్యూర్టో రికోకు బయలుదేరిన ఈ ముద్దుగుమ్మకు ఢిల్లీ విమానాశ్రయంలో అభిమానులు.