ప్రస్తుతం చికెన్ కూర చేయాలంటే టమాటాలు, రకరకాల బ్రాండెడ్ గరం మసాలాలు, పెరుగు వాడటం సర్వసాధారణమైపోయింది. కానీ వెనుకటి రోజుల్లో పల్లెటూర్లలో టమాటాలు అసలు వాడకుండానే.. ఇంట్లోని ఎండు కొబ్బరి, గసగసాలు, ధనియాలు లాంటి అతి సామాన్యమైన దినుసులతో అద్భుతమైన చిక్కటి గ్రేవీతో, చుట్టుపక్కల ఇళ్లన్నీ పరిమళించేలా కోడికూరను వండేవారు. టమాటా లేని కారణంగా చికెన్ సహజసిద్ధమైన మాంసం రుచి ఏమాత్రం తగ్గకుండా, ప్రతి ముక్కా సంప్రదాయ నాటుకోడి రుచితో నాలుకపై నాట్యమాడుతుంది.