తెలంగాణలో ఫంక్షన్లలో ప్రత్యేకంగా వండే దావత్ స్టైల్ మటన్ కర్రీ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి స్పైసీగా, ఘాటుగా, చిక్కటి గ్రేవీతో యమ్మీగా ఉండే ఈ వంటకాన్ని ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేయాలో చూద్దాం.. ఒక్కసారి ఈ రెసిపీని ప్రయత్నిస్తే, తప్పకుండా మీరు సూపర్ అనాల్సిందే.. కావాల్సిన పదార్థాలు: లేత మటన్: అరకిలో కేజీ, నూనె: 3 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు: జాపత్రి, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, బండ పువ్వు (కొద్దిగా), పచ్చిమిర్చి: 4-5, ఉల్లిపాయలు: 2 మీడియం సైజు, పుదీనా: కొద్దిగా, కసూరి మేతి: 1 1/2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్: 2.