India vs New Zealand 2nd ODI: టీమిండియా పేస్ దళంలో మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్తో (New Zealand) జరగబోయే రెండో వన్డే (ODI) మ్యాచ్కు ముందు తుది జట్టుపై తీవ్ర చర్చ నడుస్తోంది. మొదటి మ్యాచ్లో ఆకట్టుకోలేకపోయిన పేసర్ ఆకిబ్ నబీకి (Auqib Nabi) ఉద్వాసన పలికి, అనుభవజ్ఞడైన మహ్మద్ సిరాజ్ను (Mohammad Siraj) తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత్, కివీస్ మధ్య రెండో వన్డే శనివారం వెల్లింగ్టన్ (Wellington) వేదికగా జరగనుంది. ఆకిబ్ నబీ ఇప్పటివరకు ఆడిన రెండు అంతర్జాతీయ వన్డేల్లోనూ వికెట్లు తీయలేక నిరాశపరిచాడు.