బిగ్ బాస్ హౌస్‌లో తనదైన ఆటతీరుతో టైటిల్ గెలుచుకున కళ్యాణ్ పడాల.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. బిగ్ బాస్ విన్నర్ ఇమేజ్‌తో ఏకంగా ఒక హారర్ కామెడీ చిత్రాన్ని ఎంచుకుని టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వస్తున్నాడు. వింధ్యా ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. సంతోషి రెడ్డి నిర్మాణంలో, నూతన దర్శకుడు హేమంత్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘ఫన్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు.