యువ సంచలనం, బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని (Vaibhav Sooryavanshi) బీహార్ సీనియర్ క్రికెట్ జట్టుకు (Bihar Senior Cricket Team) కెప్టెన్‌గా (Captain) నియమించారు. తన కెరీర్లో తొలిసారిగా సీనియర్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. నవంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy) టోర్నమెంట్‌లోని మొదటి రెండు మ్యాచ్‌ల కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టు పగ్గాలను వైభవ్‌కు అప్పగించారు. అలాగే సూరజ్ కశ్యప్‌ను (Suraj Kashyap) వైస్ కెప్టెన్‌గా (Vice-Captain) ఎంపిక చేశారు. బీహార్ క్రికెట్ అసోసియేషన్ (BCA) శుక్రవారం ఈ మేరకు జట్టు వివరాలను ప్రకటించింది.