AP Onion Prices: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ఉల్లిపాయల ధరలకు చెక్ పెడుతూ, వినియోగదారులకు సరసమైన ధరలకే ఉల్లిపాయలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మార్కెట్ ఇంటర్వెన్షన్లో భాగంగా మహారాష్ట్ర నుంచి NCCF ద్వారా నాసిక్ నుంచి దాదాపు 800 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను ప్రత్యేక రైల్వే వ్యాగన్ల ద్వారా రాష్ట్రానికి రప్పించింది. ఈ ఉల్లిపాయలను రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రైతు బజార్ల ద్వారా కిలో కేవలం రూ.35 కే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. బహిరంగ మార్కెట్లో ధరల విపరీతమైన పెరుగుదలను సమర్థవంతంగా నియంత్రించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.