నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్న టీడీపీ.. ఇప్పుడు జడ్పీ చైర్మన్ పీఠంపై కన్నేసింది. 35 జడ్పీ స్థానాలకుగాను ఐదింటిని ఏకగ్రీవం చేసుకోగలిగింది. మిగతా 30 సీట్లలో విజయం కోసం వ్యూహాత్మకంగా పావులు కలుపుతోంది. ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. అదంతా ఒక ఎత్తయితే.. ఇప్పుడు జడ్పీ చైర్మన్ ఎంపికపై అధికార పార్టీలో అసంతృప్త రాగాలు వినిపిస్తున్నాయట. కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి.. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి జడ్పీ సీటుపై కన్నేశారు. ముగ్గురూ నామినేషన్ల సైతం వేశారు.