Gajuwaka: విశాఖపట్నం గాజువాక పరిధిలోని బాణాసంచా దుకాణాల్లో జోన్-2 డీసీపీ మేరీ ప్రశాంతి భద్రతా ప్రమాణాలను తనిఖీ చేశారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలని హెచ్చరించారు. గాజువాక: ఈ రోజు అనగా 06-11-2026 శుక్రవారం నాడు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో నక్కవారిపాలెం గ్రౌండ్లో తాత్కాలిక లైసెన్సులు పొంది బాణాసంచా విక్రయిస్తున్న దుకాణాలను, అలాగే షీలానగర్ ప్రాంతంలోని అయ్యాను క్రాకర్స్ బాణాసంచా దుకాణాలను విశాఖపట్నం జోన్-II డీసీపీ మేరీ ప్రశాంతి గారు క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.