విశాఖపట్నం నగరంలోని రుషికొండ బీచ్‌లో అరుదైన, ఆసక్తికరమైన దృశ్యం ఆవిష్కృతమైంది. భారత కోస్ట్ గార్డ్‌కు చెందిన రెండు భారీ హోవర్‌క్రాఫ్ట్‌లు అనూహ్యంగా తీరానికి చేరుకున్నాయి. గోవా నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హల్దియాకు విధి నిర్వహణ నిమిత్తం వెళుతున్న ఈ నౌకలు, సముద్రంలో.. ఒక్కసారిగా ఇసుక తిన్నెలపైకి దూసుకురావడంతో పర్యాటకులు, స్థానికులు ఆశ్చర్యపోయారు. నీటిపైనా, నేలపైనా సునాయాసంగా కదులుతున్న ఈ హోవర్‌క్రాఫ్ట్‌లను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. విశాఖ తీరంలో ఇలాంటి దృశ్యం కనిపించడం చాలా అరుదు కావడంతో, పలువురు తమ ఫోన్లలో ఆ దృశ్యాలను బంధించారు.ఈ హోవర్‌క్రాఫ్ట్‌లు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యాయి.