Madhurawada: విశాఖ మధురవాడలో అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని పీఎం పాలెం సీఐ గేదెల బాలకృష్ణ హెచ్చరిక. 45 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు వెల్లడి. మధురవాడ: బాణాసంచా విక్రయాలకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా విక్రయాలు నిర్వహిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ గేదెల బాలకృష్ణ హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా స్టాళ్లు ఏర్పాటు చేసే వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.