Shubman Gill: శుభ్మన్ గిల్ సెంచరీ చేసిన ప్రతిసారీ కేకేఆర్ అభిమానులు తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఆర్సీబీ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ వెల్లడించాడు. ఆకాశ్ చోప్రా పాడ్కాస్ట్లో తన ఆవేదనను బయటపెట్టాడు. ఐపీఎల్ 2022లో గిల్ను వదిలేసి తనను కొనసాగించిన కేకేఆర్ నిర్ణయం ఇప్పటికీ విమర్శలకు కారణమవుతోందని తెలిపాడు. Shubman Gill: క్రికెట్లో ఆటగాళ్ల మధ్య పోటీ సహజం. కానీ ఒక ఆటగాడు సెంచరీ చేస్తే మరో ఆటగాడిని సోషల్ మీడియాలో తిట్టడం ఎంతవరకు సమంజసం? ప్రస్తుతం ఆర్సీబీ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు.