Tiruvannamalai Karthigai Deepam 2026: తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయంలో కార్తీక దీపోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నవంబర్ 24న అరుణాచల మహా కొండపై కార్తీక మహా దీపం వెలిగించనున్నారు. అయితే భారీ వర్షాల సూచన నేపథ్యంలో ఆ రోజు భక్తులు కొండపైకి ఎక్కడాన్ని అధికారులు నిషేధించారు. Tiruvannamalai Karthigai Deepam: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయంలో కార్తీక దీపోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏడాది నవంబర్ 24న అరుణాచల మహా కొండపై కార్తీక మహా దీపాన్ని వెలిగించనున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.