వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీల్లో సినిమాలు తెగ సందడి చేస్తున్నాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు ప్రేక్షకులను అలరిస్తుంటే .. ఓటీటీల్లో కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే దీపావళి స్పెషల్ గా కొన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి . లగడపాటి విక్రమ్ సహిదేవ్, సంధ్య, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు చిత్రం ‘అనకాపల్లి’. ఖగేశ్ తమ్మినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన కథ అందించారు. థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నవంబర్ 3 నుంచి సన్నెక్స్ట్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.