ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పెండింగ్లో ఉన్న 23 మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్దమైంది. ఈ మున్సిపాలిటీలకు సంబంధించిన నోటిఫికేషన్ను వారంలోగా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఈనెల 10 నుంచి 12 మధ్యలో నోటిఫికేషన్ విడుదల చేసిన పోలింగ్ తేదీలను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కొన్ని మున్సిపాలిటీలకు పోలింగ్ జరగగా మరికొన్ని మున్సిపాలిటీలకు ఎన్నికల కమిషన్ పోలింగ్ నిర్వహించలేదు.. కాగా త్వరలో పెండింగ్లో ఉన్న మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్దమవుతోంది.