ఓరుగల్లు నగరాభివృద్ధికి నిధులు వరదలా పారుతున్నాయి. ఇలా ప్రతిపాదనలు పంపించగానే.. అలా మంజూరు ఉత్తర్వులు వచ్చేస్తున్నాయి. వరంగల్ కార్పొరేషన్, న్యూస్టుడే: ఓరుగల్లు నగరాభివృద్ధికి నిధులు వరదలా పారుతున్నాయి. వచ్చే మూడు, నాలుగేళ్లలో ప్రతిపాదించిన అభివృద్ధి పనులు పూర్తయితే ఓరుగల్లు నగరం దిశ దశ మారనుంది. మెట్రో నగరాల సరసన చేరేరోజు ఎంతో దూరం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరంగల్ మహా నగరపాలక సంస్థ, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) అధికారులు సమర్థంగా పనిచేస్తే కలల నగరం సాకారం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి కొత్తగా అర్బన్ చాలెంజ్ ఫండ్(యూసీఎఫ్) అమల్లోకి తెచ్చింది.