మెగా మేనల్లుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు సాయి దుర్గతేజ్. తనదైన యాక్టింగ్, స్టైల్, డ్యాన్స్ లతో సుప్రీం హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మధ్యలో రోడ్డు ప్రమాదం కారణంగా కెరీర్ లో కొంచెం వెనకపడినా రీఎంట్రీలో విరూపాక్ష సినిమాతో ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరాడీ ట్యాలెంటెడ్ హీరో. మెగా కుటుంబంలో మరో శుభకార్యం సందడి నెలకొంది. టాలీవుడ్ యంగ్ హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. నవంబర్ 5న హైదరాబాద్లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు సమాచారం.