Tirupati: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరు మేజర్ పంచాయతీతో పాటు తిరుపతి రూరల్ మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. Tirupati: తిరుపతి రూరల్ (మండలం) మండలవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, వివాదాలు తలెత్తకుండా పోలీసు, రెవెన్యూ యంత్రాంగంతో పాటు ఆయా పంచాయతీ అధికారులు సమన్వయంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.