తిరుపతిలో వైకాపా కార్యకర్తలు పెట్రోల్ బాంబులతో దాడులు చేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడులు జరిగాయి. తిరుపతి జిల్లా పెనగలూరు మండలంలోని నల్లపురెడ్డిపల్లెలో పెట్రోల్ బాంబులతో బీభత్సం సృష్టించారు. వైకాపా కార్యకర్తలంతా బూత్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఈ దాడులు చేశారు. రైల్వేకోడూరులో 4వ పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ జరిగింది. తెదేపా, స్వతంత్ర అభ్యర్థి మధ్య తోపులాట జరిగింది. ఏజెంట్‌ను బయటికి లాగడంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.