Dhanteras Shopping Tips Telugu: ధంతేరస్ 2026 నవంబర్ 6న జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడం శుభప్రదమని నమ్ముతారు. అయితే ఇనుప వస్తువులు, గాజు సామగ్రి, కత్తులు, కత్తెరలు వంటి వస్తువులను కొనకూడదని సంప్రదాయాలు చెబుతున్నాయి. ధంతేరస్ రోజున కొనకూడని వస్తువులు ఏమిటో తెలుసుకోండి. Dhanteras Shopping Tips Telugu: కార్తీక మాసంలోని కృష్ణ పక్ష త్రయోదశి తిథి రోజున ధంతేరస్ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది నవంబర్ 6వ తేదీన ధంతేరస్ పండుగను దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోనున్నారు. దీపావళి వేడుకలకు నాంది పలికే ఈ పర్వదినానికి హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రత్యేకత ఉంది.