ప్రముఖ నటి రేఖ వేదవ్యాస్ ఓ కార్యక్రమంలో తన వ్యక్తిగత జీవితం, వివాహం, ప్రేమ సంబంధాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకున్నారు. తాను ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నానని, మంచి జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నానని ఆమె వెల్లడించారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో పోలుస్తూ, తామిద్దరమే సింగిల్ గా మిగిలిపోతామేమో అని సరదాగా వ్యాఖ్యానించారు. తనకు కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నా, మంచి అబ్బాయి దొరకడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. తనకు రాబోయే భర్త ఎలా ఉండాలి అనే దానిపై పెద్ద ప్లానింగ్ ఏమీ లేదని రేఖ తెలిపారు.