Visakhapatnam: విశాఖ మేయర్‌గా ముక్క శ్రావణి, విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా విజయం సాధించడం పట్ల రాధా రంగా రాయల్ అసోసియేషన్ అధ్యక్షుడు గాదె బాలాజీ హర్షం. విశాఖపట్నం: విశాఖపట్నం కూటమి మేయర్ అభ్యర్థి ముక్క శ్రావణి గెలుపులో కీలక పాత్ర పోషించిన విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్‌కు, రాధా రంగా రాయల్ అసోసియేషన్ అధ్యక్షుడు గాదె బాలాజీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధా గెలుపొందిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా గాదె బాలాజీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలునిర్వహించారు.