సొంతగడ్డపై జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్‌ను మరో విజయం ఊరిస్తున్నది. రంజీ ఎలైట్ గ్రూప్-బీ మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్.. ఆతిథ్య జట్టు ఎదుట 259 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. బంతి ఆధిపత్యం చెలాయిస్తున్న పోరులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 5 ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయి 13 రన్స్ చేసింది. ఆ జట్టు విజయానికి 246 రన్స్ కావాలి. అభిరాథ్ రెడ్డి (8 బ్యాటింగ్), రాధేశ్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.