Guntur: జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ నేపథ్యంలో నవంబర్ 5న స్థానిక సెలవు ప్రకటన. ఓటు హక్కు వినియోగానికి ప్రైవేటు సంస్థలు సహకరించాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ స్పష్టం. గుంటూరు: జెడ్.పీ.టీ.సీ, ఎం.పీ.టీ.సీ పోలింగ్ సందర్భంగా నవంబరు 5వ తేదీన స్థానిక సెలవును ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ నిర్వహించే ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు స్థానిక సెలవు ప్రకటించడం జరిగిందని చెప్పారు.