Guntur: గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో విజయం కూటమి కార్యకర్తలదేనని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు. కేంద్రమంత్రి పెమ్మసాని అధ్యక్షతన ఆత్మీయ సమావేశం. గుంటూరు: గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులు సాధించిన ఈ విజయం కూటమి కార్యకర్తలదేనని, నగర ప్రజల ఆశీర్వాదంతో గుంటూరును మరింత వేగంగా అభివృద్ధి చేస్తామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. బుధవారం గుంటూరు నగరంలోని క్యాపిటల్ హోటల్లో కేంద్రమంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన "మేయర్ - కార్పొరేటర్ల" ఆత్మీయ సమావేశంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి పాల్గొన్నారు.