Hunter Road | ప్రజారవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచడంతోపాటు ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు ఆర్టీసీ నిరంతరం కృషి చేస్తోందన్నారు ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్ ధరంసింగ్నాయక్. Hunter Road | న్యూశాయంపేట, నవంబర్ 4 : విద్యార్థులు, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ఆర్టీసీ లక్ష్యమని ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్ ధరంసింగ్నాయక్ అన్నారు. విద్యార్థుల ప్రయాణ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వరంగల్ హంటర్‌రోడ్డులోని బొందివాగు సమీపంలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం మెయిన్ రోడ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బస్‌స్టాప్‌ను ఆయన ప్రారంభించారు.