Warangal: వరంగల్ కాశిబుగ్గకు చెందిన మూశం సారంగపాణి అకాల మరణంతో చిన్ననాటి మిత్రులు రూ.57,000 సేకరించి, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు ద్వారా కుటుంబానికి అందజేశారు. వరంగల్: వరంగల్లోని కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన మూశం సారంగపాణి ఇటీవల అకాల మరణం చెందడంతో, ఆయన కుటుంబానికి అండగా నిలిచేందుకు చిన్ననాటి మిత్రులు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా కాశిబుగ్గకు చెందిన సారంగపాణి చిన్ననాటి మిత్రులు అందరూ కలిసి రూ.57,000 ఆర్థిక సహాయాన్ని సేకరించి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు.