ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఆధిపత్యం కొనసాగినప్పటికీ, రెబల్ అభ్యర్థులు కూడా తమ సత్తా చాటారు. టికెట్లు దక్కకపోవడంతో స్వతంత్రులుగా బరిలోకి దిగిన పలువురు నేతలు విజయం సాధించారు. విశాఖలో ఎనిమిది మంది, పిఠాపురంలో పది మంది స్వతంత్రులు గెలుపొందగా.. నెల్లిమర్ల, సాలూరులో రెబల్ అభ్యర్థులు ఏకంగా చైర్పర్సన్ పీఠాలను దక్కించుకున్నారు. ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా కనిపించింది. కానీ అదే సమయంలో రెబల్స్ కూడా పార్టీలకు షాక్ ఇచ్చారు. పార్టీ గుర్తు లేకుండానే స్వతంత్రులుగా పోటీ చేశారు. మరికొన్ని చోట్ల ఏకంగా చైర్పర్సన్ పీఠాలనే దక్కించుకున్నారు. నెల్లిమర్ల నుంచి సాలూరు వరకు తమ సత్తా చూపించారు.