అమెరికా పౌరులే టార్గెట్‌గా.. భారత్‌లో ఫేక్ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అంతర్జాతీయ ముఠా గుట్టును ఈడీ రట్టు చేసింది. అమెరికా ప్రభుత్వ అధికారులమంటూ ఫోన్లు చేసి.. డ్రగ్స్, మనీలాండరింగ్ కేసుల్లో ఇరుక్కున్నారంటూ బాధితులను భయపెట్టి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించింది. ఈ కేసులో మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తాజాగా మరో నలుగురి అరెస్ట్‌తో మొత్తం ఏడుగురు ఈడీ కస్టడీకి వెళ్లారు. ఇప్పటివరకు ఈ ముఠా ఏకంగా 261 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు డిజిటల్ ఆధారాల్లో బయటపడింది.