Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘బాలు’ చిత్రంలో ఆయన వేసుకున్న కాస్ట్యూమ్స్, ముఖ్యంగా ఆ కార్గో ప్యాంటు అప్పట్లో యూత్‌ను ఎంతగా ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమా వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ స్టైల్ గురించి సినీ వర్గాల్లో చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటి, కాస్ట్యూమ్ డిజైనర్ రేణు దేశాయ్ ఆ ఐకానిక్ ప్యాంటుకు సంబంధించిన మైండ్ బ్లోయింగ్ నిజాలను బయటపెట్టారు..