దీపావళి పండుగ అనగానే వెలుగులు, స్వీట్లు, కాకరపువ్వులు, బాణసంచా సందడే గుర్తుకొస్తుంది. అయితే, పండుగ వేళ బయటకు వెళ్లొచ్చాక లేదా బాణసంచా కాల్చే ప్రాంతాల్లో తిరిగిన తర్వాత తలనొప్పి, తలలో భరించలేని బరువుగా అనిపించడం వంటి సమస్యలు చాలా మందికి ఎదురవుతుంటాయి. సాధారణంగా గాలి కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు, శ్వాసకోశ సమస్యలు మాత్రమే వస్తాయని అనుకుంటాం. కానీ, కలుషిత గాలి వల్ల నాడీ వ్యవస్థ (న్యూరోలాజికల్ హెల్త్) పై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని, తలనొప్పులు రావడానికి.