Kamal Haasan: వయసు 70 దాటినా కుర్ర హీరోలకు నిద్రలేకుండా చేస్తున్నారు లోకనాయకుడు కమల్ హాసన్. బాక్సాఫీస్ వద్ద సరికొత్త విధ్వంసం సృష్టించేందుకు ఏకంగా అరడజను (6) భారీ ప్రాజెక్టులతో మునుపెన్నడూ చూడని రీతిలో మోస్ట్ పవర్ఫుల్ లైనప్‌ను సెట్ చేసుకున్నారు. ఇందులో హీరోగా మూడు భారీ చిత్రాలు చేస్తుండగా, తన సొంత బ్యానర్‌పై నిర్మాతగా మరో మూడు క్రేజీ సినిమాలను లైన్లో పెట్టి మొత్తం సినీ రంగాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. హీరోగా కమల్ వేస్తున్న అడుగులు.